రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు అనుమతులివ్వండి

కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు సీఎం వైయస్‌ జగన్‌ లేఖ

తాడేపల్లి: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరుతూ కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్‌ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా పరిధిలో ఇరిగేషన్‌ అవసరాలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నీటిని వినియోగిస్తోందన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కోసమే ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించిందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 854 అడుగులకు చేరితే గానీ పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే అవకాశం లేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలవనరుల కమిషనర్‌కు పూర్తి డీపీఆర్‌ను అందజేశామని.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top