పార్టీ నేతల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కీలక ప్రకటన

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. 5.20 లక్షల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రతీ క్లస్టర్‌కు ఇద్దరు గ్రామ సారథులు నియమించాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతీ సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లను నియమించాలన్నారు. ప్రతి 50 కుటుంబాలు ఒక క్లస్టర్‌గా గుర్తించాలని సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో సీఎం సమావేశమయ్యారు. 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

తాజా వీడియోలు

Back to Top