`ఎట్ హోమ్`కు హాజ‌రైన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు

విజ‌య‌వాడ‌: రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జ‌గన్, శ్రీమతి వైయస్ భారతి దంపతులు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు కొట్టు సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,  పలువురు ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజ‌ర‌య్యారు.

Back to Top