ఘనంగా సీఎం వైయ‌స్‌ జగన్ పుట్టినరోజు వేడుకలు

క్యాంపు కార్యాల‌యంలో కేక్ క‌ట్ చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో  ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేక్ కట్ చేయగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీటీడీ వేదపండితుల ఆశీర్వచనం అందజేశారు. అలాగే హోస‌న్నా మినిస్ట్రీస్ పాస్ట‌ర్ జాన్‌వెస్లీ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. కార్య‌క్ర‌మంలో మంత్రులు ఆర్కే రోజా, తానేటి వ‌నిత‌, విడ‌ద‌ల ర‌జిని, జోగి ర‌మేష్‌, ఎంపీ  బాల‌శౌరి, సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ధ‌నుంజ‌య‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

Back to Top