నేడు వైయ‌స్ఆర్ జిల్లాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

ఈరోజు రాత్రి ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వారి దర్శనం

పట్టు వస్త్రాల సమర్పణ, కల్యాణోత్సవానికి హాజరు

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు జిల్లాల ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. నేడు సాయంత్రం వైయ‌స్ఆర్ జిల్లాలో సీఎం ప‌ర్య‌టించ‌నున్నారు. సాయంత్రం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. అక్క‌డి నుంచి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాల‌యం చేరుకొని శ్రీ సీతారాములను ద‌ర్శించుకుంటారు. స్వామివార్ల‌కు పట్టువస్త్రాలను సమర్పించి కల్యాణోత్సవాన్ని తిలకిస్తారు. రాత్రి కడపలో బస చేస్తారు. 16వ తేదీ ఉదయం రెండు వివాహ వేడుకల్లో పాల్గొని, అక్కడి నుంచి కర్నూలు చేరుకుంటారు. అక్కడ ఓ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.   

తాజా ఫోటోలు

Back to Top