ఆడపడుచులకు అన్నగా.. అండాదండగా అన్ని తానై

మహిళల సంతోషమే ఇంటికి వెలుగు

వారి ఆర్థికస్వావలంబనే కుటుంబ ప్రగతికి మెట్టు

అన్నింటా సగం.. అప్పుడే సమాజానికి బలం 

మ‌హిళా సంక్షేమానికి పెద్ద‌పీట వేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
 

ప్రతి ఆడపడుచును లక్షాధికారిని చేస్తా అని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తన లక్ష్యంగా చేసుకున్న మాట ఇది. తండ్రి మాటను నిజం చేసే దిశలో తనయుడి వడివడి అడుగులు వేస్తున్నారు. మహిళల స్వావలంబనకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తలపెట్టిన ఎన్నెన్నో పథకాలు.. ఇంటింటా.. వెలుగులవుతున్నాయి. బిడ్డ భవిష్యత్తు కోసం తల్లి కనే కలలు అన్నీ ఇన్నీ ఉండవు. పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదన్న వైయస్‌ జగన్‌ సీఎంగా ఆ దిశలో అభినందనీయ ప్రయత్నాలు చేస్తున్నారు. 

జగన్న పాలన.. తల్లులు మెచ్చిన పాలన
ప్రతి మహిళనూ నోరారా ‘అమ్మా’ అని సంబోధించే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈవాళ ప్రతి ఆడపడుచుకు ఓ అన్నలా.. ఓ తమ్ముడిలా కనిపిస్తున్నారు. తల్లులు తమ బిడ్డల పాలిట ‘దేవుడిచ్చిన మామయ్య’ అని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నారు. నారీ జనం జే కొడుతున్న వేళ.. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తోంది జగనన్న పాలన.. తల్లులు మెచ్చిన పాలన.

అన్ని విధాలా తోడుగా నేనుంటా..
అమ్మా, భయపడకు.. నీ బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదవాలి. మీ కుటుంబం తలరాత మారాలి. అందుకు అన్ని విధాలా తోడుగా నేనుంటా.. అని ఎన్నికల ముందు వైయస్‌ జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీ. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు. ఆ బిడ్డలకు మేనమామగా దీవెనలందిస్తున్నారు. బిడ్డల చదువుతోనే సరిపెట్టలేదు. డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రుణాల మంజూరులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రతి మహిళ స్వంతింటి కలను నిజం చేసే దిశలో అడుగులు వేస్తున్నారు. ఆడపడుచుల పేరిటే ఇంటిస్థలం.. ఆడపడుచుల పేరిటే ఇల్లు.. ఆడపడుచుల చేతిలో ఆస్తి పెట్టడమంటే ఆ కుటుంబానికి ఎనలేని భద్రత కల్పించడమే కదా.. 

స్త్రీ బాగుంటేనే.. కుటుంబాలు బాగుంటాయి
అమ్మా.. మనది ఆడవాళ్ల రాజ్యం. కుటుంబంలో స్త్రీలు బాగుంటేనే.. ఆ కుటుంబాలు బాగుంటాయి. అని గట్టిగా చెప్పిన వైయస్‌ జగన్‌. ముఖ్యమంత్రిగా ఆ దారిలోనే నడుస్తున్నారు. దిశ చట్టం మొదలుకొని ఎన్నెన్నో కార్యక్రమాలను స్త్రీల భద్రత కోసం స్త్రీల ప్రగతి కోసం ప్రవేశపెడుతున్నారు. ఓ కుటుంబ పెద్దలా.. ప్రజలందరి గురించి ఆలోచించడం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పెద్ద మనసును చాటుతోంది. 

‘అమ్మఒడి’తో ప్రతి తల్లీ సంతోషపడుతోంది
పిల్లలకు సంబంధించి ప్రాథమిక విద్య, హై స్కూల్‌ విద్య కూడా భారమైనదే. తమ బిడ్డల్ని చదివించాలని ఉన్నా.. తమలా వాళ్ల కష్టపడుతున్నా.. కలిసిరాని పరిస్థితులు ఏడిపిస్తుంటాయి. పుస్తకాలు కొనడం కూడా బరువైన కుటుంబాలు ఎన్నో ఉన్న సమాజం మనది. తల్లుల భారం దింపడానికి, నేనున్నానని భరోసా ఇచ్చారు సీఎం వైయస్‌ జగన్‌. అధికారంలోకి రాగానే బడికెళ్లే పిల్లల కోసం ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెట్టారు. ఏటా ప్రతి తల్లికీ రూ.15 వేలు ఈ పథకం ద్వారా అందించడం మొదలుపెట్టారు. దాదాపు 43 లక్షల మంది తల్లులు లబ్ధిదారులయ్యారు. 82 లక్షల మంది పిల్లల చదువులకు ఉపయోగపడింది. ముఖ్యమంత్రి గొప్ప మనసుకు ఇంతకన్నా గొప్ప సాక్ష్యం కావాలా..? అంటోంది. 

తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ‘అమ్మ ఒడి’ పథకం ప్రజలకిచ్చారు. అలాగే స్కూళ్లు తెరిచేనాటికల్లా యూనిఫాంతో సహా షూలు, బ్యాగు, పుస్తకాలు ఇస్తానంటున్న వైయస్‌ జగన్‌లో ప్రతి బిడ్డ తల్లీ ఓ సోదరుడిని చూస్తోంది. తమ బిడ్డల కోసం నడిచొచ్చిన మేనమామగా చెప్పుకుంటూ మురిసిపోతోంది. ఇంటర్‌స్థాయి వరకు ప్రతి బిడ్డ కోసం అందిస్తున్న ఈ ‘అమ్మ ఒడి’ పథకం సామాన్యుల ఇంట పండుగలాంటిదే..

పెద్ద చదువులు కూడా నేను చదివిస్తా..
పేదరికం పెద్ద చదువులకు ఆటంకం కారాదన్నది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌  సంకల్పం. అందుకే పూర్తిస్థాయిలో ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం అన్నారు. అది ముందు తల్లుల ఖాతాలో వేస్తానంటున్నారు. అలా చేస్తే.. కాలేజీలకు ఫీజులు కట్టే ఆ తల్లికే ఓ హక్కు వస్తుంది. చదువుల పరిస్థితి గురించి కాలేజీలతో మాట్లాడే ధైర్యమూ ఉంటుంది.. అన్న ఆలోచన ముఖ్యమంత్రిది. 
ప్రొఫెషనల్‌ కోర్సులు, పెద్ద పెద్ద చదువులు ఇక ఏ మాత్రం తమకు దూరమైనవి కావన్నది పేదలకిప్పుడు పెద్ద భరోసా.

అమ్మకు జగనన్నే చేయూత
ఫీజురీయింబర్స్‌మెంట్‌ దగ్గరే ఆగిపోలేదు ప్రభుత్వం. జగనన్న వసతి దీవెన పేరిట తల్లుల పేరిట మరో రూ.20 వేలు ఇస్తున్నారు. అలాగే పాలిటెక్నిక్‌లాంటి కోర్సులు చదివే వారికి రూ.15 వేలు ఇస్తున్నారు. ఫీజులు కట్టడంతో పాటు, ఏడాది పాటు చదువుకాలంలో విద్యార్థి ఖర్చులకు అందిస్తున్న అదనపు సాయమిది. మొత్తానికి పిల్లల చదువులకు సంబంధించి ‘అమ్మ’నే జగనన్న నమ్మకం. అమ్మకు జగనన్నే చేయూత. 

మహిళా స్వావలంబనకు ఎన్నెన్నో పథకాలు
ప్రతి పేదవాడి స్వంతింటి కలను నిజం చేయాలన్న వైయస్‌ఆర్‌ ఆశయం నాడు లక్షలాది మందికి గూడునిచ్చింది. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు తండ్రి ఆశయాల బాటలో నడుస్తున్న తనయుడు రెండడుగులు ముందుకేస్తున్నారు. జూలై 8 వైయస్‌ఆర్‌ పుట్టిన రోజున రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తున్నారు. ఆ ఇంటిస్థలం పట్టాలు ఆడవారి పేరుమీదనే ఇస్తున్నారు. మహిళలకు సంబంధించి నేడు ఇంటిస్థలం.. రేపటి రోజు ఇళ్లే కాదు.. మరెన్నో చేయాలన్నది సీఎం ఆలోచన. ఆ దిశలో ఆయన  డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీలేని రుణాలు ప్రకటించారు. పొదుపు సంఘాలను పరిపుష్ఠం చేసి.. అందులోని మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నామినేషన్‌ పనులకు సంబంధించి 50 శాతం కాంట్రాక్టు పనులు అప్పగించడానికి సిద్ధపడుతున్న సీఎం.. మహిళలకిప్పుడు ఓ గొప్ప భరోసాగా నిలుస్తున్నారు. 

మద్యపాన నిషేధం దిశగా అడుగులు
దాదాపు 14 నెలల పాటు, 3648 కిలోమీటర్ల మేర జగన్‌ చేసిన సుదీర్ఘ పాదయాత్రలో వేలు, లక్షలుగా మహిళలు కలిశారు. ఒక సోదరుడితో చెప్పుకున్నట్లుగా తమ బతుకు కష్టాల గురించి మొరపెట్టుకున్నారు. ఆ కష్టాల పరంపరలో పెద్ద కష్టంగా చెప్పుకుంది మద్యం మహమ్మారి గురించే. తమ కుటుంబాలను గుల్ల చేస్తున్న మద్యం నుంచి తమను కాపాడాలంటూ వేడుకున్నవారెందరో.. విపక్ష నేతగా అన్నీ శ్రద్ధగా విన్న ఆయన.. నేడు అధికార పక్షనేతగా మద్యం మహమ్మారిపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. పద్ధతిగా మద్యపాన నిషేధం దిశకేసి అడుగులేస్తున్నారు. బెల్టుషాపుల పీడ మొదట్లోనే వదిలించారు. 

నిజంగానే ‘మద్యం’ దుష్పరిమాణాలు అటు కుటుంబ వ్యవస్థపై, ఇటు సామాజిక వ్యవస్థపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. అలాంటి మద్యం విషయంలోనూ ముఖ్యమంత్రి ఆలోచన తీరు సాహసోపేతంగానే ఉంది. మద్యపాన వ్యసనం విషయంలో సీఎం ఆలోచనలు సీరియస్‌గా సాగడానికి మహిళలే కారణమనడంలో సందేహం లేదు. వారికి మంచి చేయాలన్న లక్ష్యంతో ఎంత ముందుకైనా వెళ్లడానికి ముఖ్యమంత్రి సిద్ధమంటున్నారు.

స్త్రీ రక్షణ కోసం ‘దిశ’ చట్టం
‘స్త్రీ కంటతడిపెడితే ఆ ఇంటికి అరిష్టం’ అన్నది వైయస్‌ఆర్‌ నమ్మిన మాట. తరచూ ఆయన ఆ మాటను ఉపయోగించేవారు కూడా. గృహహింస పేరిటనే కాదు.. మరింత పాశవికంగా అత్యాచారపర్వాలకు ఒడిగట్టే రాక్షసజాతి సమాజంలో ఉంది. ఖచ్చితంగా శిక్షలు అనుభవించి తీరాల్సిన నరరూప రాక్షసజాతి అది. ఇప్పటి దాకా ఏ రాజకీయ నాయకుడు ఆలోచించని రీతిలో ఆలోచించారు వైయస్‌ జగన్‌. ఆలోచన తట్టిన మరుక్షణం స్త్రీల రక్షణ కోసం ‘దిశ’ చట్టం తెచ్చారు.

మహిళా లోకానికి ఆత్మబంధువు
ఇలా మహిళలకు సంబంధించి ప్రతి విషయంలోనూ సరైన దిశలో పాలనా సంస్కరణలు చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రోజు ప్రతి అవ్వకు ఓ మనవడిలా కనిపిస్తున్నారు. ప్రతి ఆడపడుచుకు ఓ సోదరుడిలా.. కనిపిస్తున్నారు. చదువుకుంటున్న ఆడబిడ్డలకు తమ ఇంటి పెద్దాయనగా కనిపిస్తున్నారు. మొత్తానికి ఆంధ్రరాష్ట్ర మహిళాలోకానికి వైయస్‌ జగన్‌ ఇప్పుడు ఆత్మబంధువై నిలిచారు. 

చెప్పాడంటే.. చేస్తాడంతే..
ఇప్పటి దాకా జనం చూసింది వేరు.. ఇప్పుడు చూస్తోంది వేరు. కేవలం ఏడాదికాలంలోనే ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ పనితీరు సరికొత్తగా కనిపిస్తోంది. వ్యవస్థల పనితీరులో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ‘చెప్పాడంటే.. చేస్తాడంతే’ అని కళ్లు మూసుకుని నమ్మేస్థాయికి ప్రజలొచ్చారు..

 

Back to Top