నా వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు

వైయస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌‌

తాడేపల్లి: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైయస్‌ఆర్‌ సీపీ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులుందరికీ.. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘మహానేత వైయస్‌ఆర్‌ ఆశయ సాధనే లక్ష్యంగా, విలువలు, విశ్వసనీయతల పునాదులపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పురుడు పోసుకుంది. ఈ పదేళ్ల ప్రయాణంలో కష్ట,సుఖాల్లో నాకు అండగా నిలిచిన ప్రజలకు, నాతో కలిసి నడిచిన నాయకులకు, నా వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top