మానవాళి క్షేమం కోసం ప్రార్థించండి

ముస్లింలకు సీఎం వైయస్‌ జగన్‌ రంజాన్‌ మాసం శుభాకాంక్షలు
 

 
తాడేపల్లి: కరోనా మహమ్మారిని అధిగమించి మానవాళి క్షేమంగా ఉండాలని ప్రార్థించాలని సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్రంలోని ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా   ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. రంజాన్‌ నెల జీవితానికి ప్రేమాభిమానాలతో కూడుకున్న ఒక కానుక. ఈ నెలలో రాష్ట్రంలోని ముస్లిం కుటుంబాలన్నీ సకుటుంబ సమేతంగా శాంతి–సౌభాగ్యాలతో విలసిల్లాలి. అందరూ నెల పొడవునా క్షేమంగా ఇళ్లల్లోనే ఉండి కరోనా మహమ్మారిని అధిగమించాలని ట్విట్టర్‌లో ఆకాంక్షించారు.      

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top