అనంతపురం: యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగిన లేచిన ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యంలో ఉన్న శక్తిని, విశ్వాసాన్ని ప్రపంచానికి చాటిన మహిమాన్వితమైన పర్వదినం ఈస్టర్. మనందరి జీవితాల్లో శాంతి, దయ, ప్రేమను ఈ ఈస్టర్ నింపాలని కోరుకుంటున్నాను. క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.