అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారాంకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ సచివాలయంలో స్పీకర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి బర్త్‌డే విసేస్ చెప్పారు. అలాగే శాసనమండలి చైర్మన్ కె. మోషేన్ రాజు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని సీతారాంను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్‌గా ఎంపిక చేసి బీసీ సామాజిక వర్గానికి అత్యున్నత స్థానం కల్పించారు. బీసీ (కళింగ) సామాజిక వర్గానికి చెందిన తమ్మినేసి సీతారం ఆముదాలవలస నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో ప్రభుత్వ విప్‌గా, 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మున్సిపల్ శాఖ మంత్రిగా సీతారాం సేవలందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై తమ్మినేని సీతారాం 13,856 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.