రేపు, ఎల్లుండి వైయస్‌ఆర్‌ జిల్లాలో సీఎం పర్యటన

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు, ఎల్లుండి వైయస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి వైయస్‌ఆర్‌ జిల్లాకు సీఎం వైయస్‌ జగన్‌ బయల్దేరి సాయంత్రం 4:45 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన సాయంత్రం 5:15 గంటలకు ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఎస్టేట్‌కు చేరుకోనున్నారు. సెప్టెంబర్‌ 2వ తేదీ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top