తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు(02.11.2023) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రుషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ ప్లీనరీ (ఐసీఐడీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి ఉదయం 7.35 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడ రుషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ ప్లీనరీ (ఐసీఐడీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి, అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.