రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌ ఏలూరు జిల్లా దెందులూరు పర్యటన 

వైయ‌స్ఆర్ ఆస‌రా ఆర్థిక సాయం విడుద‌ల చేయ‌నున్న ముఖ్య‌మంత్రి

అమ‌రావ‌తి:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (25.03.2023) ఏలూరు జిల్లా దెందులూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. వైయ‌స్ఆర్ ఆసరా ఆర్ధిక సాయాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్  విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 – 12.35 బహిరంగ సభలో వైయ‌స్ఆర్‌ ఆసరా ఆర్ధిక సాయాన్ని సీఎం వైయ‌స్‌ జగన్ విడుద‌ల చేయ‌నున్నారు.  కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు దెందులూరు నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top