నేడు `జ‌గ‌న‌న్న చేదోడు`

వ‌రుస‌గా రెండో ఏడాది ప‌థ‌కం అమ‌లు

కాసేప‌ట్లో ల‌బ్ధిదారుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేయ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేపల్లి: రాష్ట్రంలోని ర‌జ‌క‌, నాయీ బ్రాహ్మ‌ణ‌, ద‌ర్జీ అన్న‌ద‌మ్ములు, అక్క‌చెల్లెమ్మ‌ల సంక్షేమం కోసం వ‌రుస‌గా రెండో ఏడాది ``జగనన్న చేదోడు`` ప‌థ‌కాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు ప్రారంభించ‌నున్నారు. కాసేప‌ట్లో తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కి 2,85,350 మంది ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 285.35 కోట్లు జ‌మ చేయ‌నున్నారు. షాపులున్న ర‌జ‌క‌, నాయీ బ్రాహ్మ‌ణ‌, ద‌ర్జీల‌కు `జగనన్న చేదోడు` కింద రూ.10వేల ఆర్ధిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం ఏటా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దఫా షాపులున్న 1,46,103 మంది టైలర్లకు రూ.146.10 కోట్లు, షాపులున్న 98,439 మంది రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40,808 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40.81 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జమ చేయనున్నారు. నేడు విడుద‌ల చేయ‌బోయే రెండో ఏడాది నగదుతో కలిపి.. ఇప్పటి వరకూ జగనన్న చేదోడు కింద రూ.583.78 కోట్లు రాష్ట్రంలోని ర‌జ‌క‌, నాయీ బ్రాహ్మ‌ణ‌, ద‌ర్జీ అన్న‌ద‌మ్ములు, అక్క‌చెల్లెమ్మ‌లకు అందించిన‌ట్టు అవుతుంది. 

Back to Top