అనుకున్న లక్ష్యంలోగా  పోల‌వ‌రం పూర్తి చేయాలి

పోలవరం పనుల పురోగతిపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

కేంద్రం నుంచి  సకాలంలో నిధులు వచ్చేలా అధికారులు దృష్టిపెట్టాలి

 పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలి. 

వచ్చే నెల ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలను సందర్శిస్తా..

 పశ్చిమగోదావరి: అనుకున్న లక్ష్యంలోగా పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు.  2022 జూన్‌ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలని, టన్నెల్, లైనింగ్ పనులు పూర్తి చేయాలని  సూచించారు. సోమ‌వారం పోలవరం ప్రాజెక్టును సీఎం వైయస్‌.జగన్ సంద‌ర్శించారు. తాడేపల్లి నుంచి నేరుగా పోలవరంకు హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు హెలిపాడ్‌ వద్ద  మంత్రులు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. హెలిపాడ్‌ వద్దనున్న వ్యూ పాయింట్‌ నుంచి ప్రాజెక్టును సీఎం ప‌రిశీలించారు. అక్కడ నుంచి ఇటీవలే పూర్తైన స్పిల్‌వే మీదకు చేరుకున్న ముఖ్య‌మంత్రి ..స్పిల్‌వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించారు. ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు.  
అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి పోలవరం పనుల పురోగతిని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.   రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల్ని సీఎంకు అధికారులు వివ‌రించారు. ఆ తర్వాత అధికారులతో కలిసి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

 స్పిల్‌వే 42 గేట్లు అమర్చినట్టు సీఎంకు అధికారులు తెలిపారు. ఎగువ కాఫర్‌ డ్యాం పనులను పూర్తిచేశామన్న అధికారులు.. దిగువ కాఫర్ డ్యాం పనుల పరిస్థితిని వివరించారు. ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులపై సీఎం ఆరా తీశారు.   

పోలవరం పనుల ప్రగతి:

  •  స్పిల్‌వే పనులు దాదాపుగా పూర్తిచేశామన్న అధికారులు
  •  48 గేట్లలో 42 గేట్లు అమరిక, మిగిలిన గేట్లను కూడా త్వరలోనే బిగిస్తామని తెలిపిన అధికారులు
  •  జర్మనీ నుంచి సిలెండర్ల వచ్చాయని తెలిపిన అధికారులు
  •  ఎగువ కాఫర్‌డ్యాంలో అదివరకు ఉన్న ఖాళీలను పూర్తిచేశామన్న అధికారులు
  •  దిగువ కాఫర్‌డ్యాం పనులు పరిస్థితిని వివరించిన అధికారులు
  •  ఎర్త్‌కం రాక్‌ఫిల్‌డ్యాం(ఈసీఆర్‌ఎఫ్‌)పనులపై అధికారులను అడిగిన సీఎం
  •  కాఫర్‌ డ్యాంలో ఖాళీలు కారణంగా గతంలో వచ్చిన వరదలకు ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ ప్రాంతం దెబ్బతిందని... దీనిపనులు ఎలా చేయాలన్నదానిపై డిజైన్లు కూడా ఖరారు అవుతాయని తెలిపిన అధికారులు.
  •  2022 జూన్‌కల్లా లైనింగ్‌తో కలుపుకుని రెండు కాల్వలకు లింకు పనులు పూర్తికావాలని, టన్నెల్‌పనులు, లైనింగ్‌పనులు పూర్తికావాలని సీఎం ఆదేశం.
  •  ఈ డిసెంబర్‌కల్లా తవ్వకం పనులు పూర్తవుతాయని, ఆతర్వాత మిగిలిన పనులు పూర్తిచేస్తామని తెలిపిన అధికారులు.

 పోలవరం  ఆర్‌ అండ్‌ ఆర్‌ పైనా సీఎం సమీక్ష.

  •  మొత్తం 90 ఆవాసాల్లో ఆగస్టునాటికి 48 ఆవాసాలనుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు వివరించిన అధికారులు.
  •  గతంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులపై దృష్టిపెట్టలేదు. 
  •  ఆర్‌  అం అండ్‌  పనులను పూర్తిగా వదిలేశారు. 
  •  మన ప్రభుత్వం వచ్చాక ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులపై పూర్తి దృష్టిపెట్టాం. 
  •  పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలి. 
  •  ఏదో కట్టాం కదా? అన్నట్టు పునరావాస కాలనీలు కట్టకూడదన్న సీఎం
  •   కచ్చితంగా నాణ్యత ఉండాలన్న సీఎం
  •  ఇంతపెద్ద  ఎత్తున పునరావాస కాలనీలు కడుతున్నప్పుడు.. సహజంగానే ఎక్కడోచోట అలసత్వం కనిపించే అవకాశాలు ఉంటాయి.
  •  అలాంటి అసత్వానికి తావు ఉండకూడదు, నాణ్యత కచ్చితంగా ఉండాలన్న సీఎం.
  •  ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల్లో నాణ్యత కచ్చితంగా పాటించేలా ఒక అధికారిని నియమించాలన్న ముఖ్యమంత్రి.
  •  ఆ అధికారి ఇచ్చే ఫీడ్‌ బ్యాక్‌ను తప్పకుండా అధికారులు పరిగణలోకి తీసుకోవాలన్న సీఎం.
  •  తప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు కచ్చితంగా వాటిని సరిదిద్దుకోవాలన్న సీఎం.
  •  వేగంగా నిర్మించాలని, లక్ష్యాలను త్వరగా చేరుకోవాలన్న ప్రయత్నంలో అక్కడక్కడా తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి, అలాంటి సందర్భాల్లో వాటిని సరిదిద్దే ప్రయత్నాలు తప్పకుండా జరగాలన్న సీఎం.
  •  కొంత డబ్బు ఎక్కువ ఖర్చుపెట్టినా సరే, నాణ్యత మాత్రం తప్పకుండా పాటించాలన్న సీఎం
  •  పునరావాస కాలనీల్లో నిర్వాసితులు జీవితాంతం ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్న సీఎం
  •  కాలనీల నిర్మాణంతోపాటు.. సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలన్న సీఎం.
  •  రోడ్లు, ఇతర సామాజిక అభివృద్ధి పనులను స్థిరంగా  చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్న సీఎం.
  •  ఆగస్టులో కొన్ని ఇళ్లను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, వరద ఉంటే కనుక అది మళ్లీ తగ్గేసరికి నవంబరు, డిసెంబరు పట్టే అవకాశాలు ఉంటాయన్న సీఎం.
  •  ఈలోగా ఈ కాలనీలను పూర్తిచేయడానికి దృష్టిపెట్టాలని, ఈలోగా నిర్వాసితులకు ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచి పునరావాస శిబిరాలను ఏర్పాటుచేయాలన్న సీఎం
  •  ఆర్థికంగా రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాసరే... ఆర్‌ అండ్‌ ఆర్‌కు సంబంధించి బిల్లులు ఎక్కడా పెండింగులో పెట్టడంలేదన్న సీఎం. 
  •  ఇకపైకూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ బిల్లులను పెండింగులో పెట్టకుండా చూడాలని సీఎం ఆదేశం. 
  •  ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులను వేగంగా చేసుకుంటూ ముందుకు పోవాలన్న సీఎం.  
  •   పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి దాదాపుగా రూ.2300 కోట్లు రావాల్సి ఉన్నా... పనులకు ఎక్కడా ఆటంకం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఇస్తోందన్న సీఎం. 
  •   సుమారు ఆరు నెలలుగా ఈ బిల్లులు పెండింగులో ఉన్నాయన్న అధికారులు. 
  •   కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు సకాలంలో వచ్చేలా అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం. 
  •  కేంద్రం నుంచి బిల్లుల మంజూరుకు సంబంధించి ఒక అధికారిని ఢిల్లీలో ఉంచాలన్న సీఎం. 
  •  గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక అధికారిని పెట్టామన్న అధికారులు. 
  •  వచ్చే నెల ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలను సందర్శిస్తానని తెలిపిన సీఎం. 
  •   నిర్వాసితులకు జీవనోపాథి, నైపుణ్యాభివృద్ధిపైనా దృష్టిపెట్టామన్న అధికారులు.
  •  నిర్వాసితుల్లో ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్నవారికి తిరిగి భూములు ఇచ్చేందుకు భూమిని గుర్తించాలని సీఎం ఆదేశం.
  •  చాలా క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా... పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న సీఎం. 
  •  అనుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకు వచ్చేలా ముందుకు సాగాలన్న సీఎం.

ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్‌, రవాణాశాఖమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి  తానేటి వనిత, నీటిపారుదలశాఖ  కార్యదర్శి జె శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే  బాలరాజు, పోలవరం నిర్మాణసంస్ధ ప్రతినిధులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు.

Back to Top