నేడు సీఎం వైయ‌స్ జగన్‌ నంద్యాల, తిరుపతి జిల్లాల పర్యటన

టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబాలను పరామర్శించనున్న సీఎం

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ నంద్యాల‌, తిరుప‌తి జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు ఆక‌స్మిక మ‌ర‌ణం పొంద‌డంతో వారి స్వ‌గ్రామ‌మైన నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేరుకొని కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శిస్తారు. అలాగే రెండు రోజుల క్రితం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి మ‌ర‌ణించ‌డంతో వారి కుటుంబాలను ముఖ్య‌మంత్రి పరామర్శించనున్నారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 3.15 గంటలకు నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామానికి చేరుకుంటారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5.15 గంటలకు తిరుపతి రూరల్‌ తుమ్మలగుంటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top