శ్రీరాజశ్యామలాదేవిని దర్శించుకున్న సీఎం వైయస్‌ జగన్‌

విశాఖపట్నం: విశాఖ శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులతో వారికోత్సవానికి హాజరైన సీఎం వైయస్‌ జగన్‌కు ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం శ్రీ రాజశ్యామల దేవిని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠంలోని ఆలయాలను దర్శించుకున్నారు. మూడు రోజులుగా కొనసాగుతున్న శ్రీ రాజశ్యామలాదేవి యాగంలో పాల్గొన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి దంప‌తులు, డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణదాస్‌, మంత్రులు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, అవంతి శ్రీ‌నివాస్ ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top