ఈనెల 25న చిత్తూరు జిల్లాకు సీఎం వైయస్‌ జగన్‌

ఇళ్ల పట్టాల పంపిణీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి సమీక్ష

తిరుపతి: పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 25వ తేదీన చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 25న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని చిత్తూరు నుంచి సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారన్నారు. అదే రోజు 15 లక్షల ఇళ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తారని చెప్పారు. 15 రోజుల పాటు ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని, అన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని చెప్పారు. 31 లక్షల మందికి ఇకేసారి ఇళ్ల పట్టాలివ్వడం ఒక చరిత్ర అని, పేదల అభ్యున్నతి కోసం సీఎం వైయస్‌ జగన్‌ తపన పడుతున్నారని తెలిపారు. మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. 

Back to Top