రేపు వైయ‌స్ఆర్‌ జిల్లాలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు(02.09.2023) వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. శ‌నివారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత నేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైయ‌స్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి.  ఆ తర్వాత వైయ‌స్ఆర్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top