రేపు నెల్లూరు జిల్లాలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (23.02.2022, బుధవారం) నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప వెళ్ళి, అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరి చేరుకుంటారు. ఉదయగిరి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ (మెరిట్స్‌) వద్ద జరిగే అంత్యక్రియల్లో పాల్గొని అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేరుకుంటారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top