పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటన

టీడీపీ పాలనకు వైయస్‌ఆర్‌సీపీ పాలనకు తేడాను గమనించండి

గత ప్రభుత్వంలో ఫోటోల కోసం తాపత్రయపడ్డారు తప్పితే.. ప్రజలకు మంచి 
జరిగిందా లేదా అనేది ఆలోచించలేదు

ప్రజలకు మంచి సహాయం అందలేదు అనే మాట రాకూడదు

కలెక్టర్‌ ఎక్కడా పని చేయలేదు అనే మాట వినపడకూడదు

పేదలకు సహాయం అందించే విషయంలో వెనుకడుగు వేయకండి

తక్కువ డ్యామేజీ జరిగినా రూ.10 వేలు ఇవ్వాల్సిందే

ప్రతి గ్రామంలో విలేజీ క్లినిక్‌తో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు

పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలి

పేరు,విస్తీర్ణం, పంట నష్టం వివరాలు ఆర్‌బీకేల్లో పొందుపరుస్తాం

ఎవరి పేరు అయినా మిస్‌ అయితే ఆర్‌బీకేల్లో ఫిర్యాదు చేయండి: సీఎం వైయస్‌ జగన్‌

కోనసీమ జిల్లా: ఈ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. గోదావరి వరద ప్రభా­విత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురజపులంక, కూనలంక గ్రామాల్లో వరద బాధితులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్  పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని కోరారు. గతంలో పేపర్లో ఫొటోలు వస్తే చాలు అనుకునేవారు.. కానీ ఇప్పుడు ఇలా కాదు, వారం రోజులు జిల్లా కలెక్టర్లకు సమయం ఇచ్చాం. వరద బాధితులందరికీ సాయం అందించాలని ఆదేశించాం. నేనే స్వయంగా వచ్చి వరద బాధితులను కలుస్తా అని చెప్పా. రెండు రోజులుగా వరద బాధితులతో మాట్లాడుతున్నాన‌ని  సీఎం పేర్కొన్నారు.

పేదలకు సహాయం అందించే విషయంలో వెనుకడుగు వేయకండ‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించాను. తక్కువ డ్యామేజీ జరిగినా రూ.10 వేలు ఇవ్వాల్సిందేన‌ని చెప్పాను. ప్రతి గ్రామంలో విలేజీ క్లినిక్‌తో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలు ఆర్‌బీకేల్లో పొందుపరుస్తామ‌న్నారు. ఎవరి పేరు అయినా మిస్‌ అయితే ఆర్‌బీకేల్లో ఫిర్యాదు చేయండ‌ని సూచించారు.  

రూ.150 కోట్ల‌తో లంక గ్రామాల్లో రివెట్‌మెంట్ వాల్ నిర్మాణం
లంక గ్రామాల్లో వ‌ర‌ద ముప్పు నుంచి ర‌క్షించేందుకు రూ.150 కోట్ల‌తో రివెట్‌మెంట్ వాల్ నిర్మాణం చేప‌డుతున్న‌ట్లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. వెంట‌నే ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాల‌ని ఇంజినీర్ల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. గ‌త ప్ర‌భుత్వానికి ఈ ప్ర‌భుత్వానికి మ‌ధ్య మార్పును గ‌మ‌నించండి. ఈ నాలుగేళ్ల‌లో ఇటువంటి ఏ ఘ‌ట‌న జ‌రిగినా కూడా క‌లెక్ట‌ర్‌కు ఆదేశాలు ఇచ్చి వారి చేతుల్లో డ‌బ్బులు పెట్టాను. గ‌తంలో లేని  గ్రామ స‌చివాల‌య‌, వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను గ్రామ స్థాయిలోకి తీసుకువ‌చ్చాను. క‌లెక్ట‌ర్ల‌కు, అధికారుల‌కు స‌మ‌యం ఇచ్చి ప్ర‌తి గ్రామంలో యాక్టివేట్ చేశాను. న‌ష్ట‌పోయిన ఏ ఒక్క‌రూ కూడా మిగిలిపోకూడ‌దు. నాకు స‌హాయం అందలేద‌న్న మాట రాకూడ‌దు. నేనే వ‌స్తాను. గ్రామాల్లో ఏ ఒక్క‌రూ కూడా మా క‌లెక్ట‌ర్ స‌రిగ్గా ప‌ని చేయ‌కూడ‌ద‌న్న మాట విన‌ప‌డ‌కూడ‌ద‌ని చెప్పాను. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా మాకు స‌హాయం అందింది, నిత్యావ‌స‌రాలు అందించార‌ని అధికారులు బాగా ప‌ని చేస్తున్నార‌ని చెబుతున్నార‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. 

తాజా వీడియోలు

Back to Top