శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైయ‌స్ జగన్‌

విశాఖ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తో కలిసి రాజశ్యామల అమ్మవారిని, వ‌న దుర్గ అమ్మ వారిని  ముఖ్య‌మంత్రి దర్శించుకున్నారు. అనంత‌రం  శారదా పీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైయ‌స్ జగ‌న్ పాల్గొన్నారు. అంత‌కు ముందు శారదా పీఠంలో సీఎం వైయ‌స్‌ జగన్‌కు సాదర స్వాగతం ల‌భించింది.  శారదాపీఠంలో ఉత్తరాధికారి స్వాత్మానందం సరస్వతి... పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిలను సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి క‌లిశారు.  శారదాపీఠం చేరుకున్న సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రులు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్,. వెస్ట్ ఇంచార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ స్వాగ‌తం ప‌లికారు.  

Back to Top