తాడేపల్లి: ఈనెల 26వ తేదీన వైయస్ఆర్ రైతు భరోసా రెండో విడత సాయం అన్నదాతలకు అందించనున్నట్టు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. స్పందన కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉపాధిహామీ పనులు, రబీ సన్నద్ధత, వైయస్ఆర్ శాశ్వత భూహక్కు - భూరక్ష, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు, డాక్టర్ వైయస్ఆర్ అర్భన్ క్లినిక్స్, అక్టోబరు, నవంబరు నెలలో అమలు చేయనున్న పథకాలపై సీఎం సమీక్షించారు. 10 రోజుల వైయస్ఆర్ ఆసరా కార్యక్రమాలను నిర్వహించిన కలెక్టర్లు, అధికారులందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..
– ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టండి.
– విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మెటీరియల్ కాంపొనెంట్ వినియోగంపై తగిన దృష్టిపెట్టండి.
– కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణాల విషయంలో వెనకబడి ఉన్నారు.
– వెంటనే సచివాలయాల భవనాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి.
– రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తిచేయాలి.
– కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు దృష్టిపెట్టాలి.
– వైయస్సార్ హెల్త్ క్లినిక్స్‌పైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం.
బీఎంసీయూల నిర్మాణం
బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణ పనులు మరింత చురుగ్గా చేపట్టాలి.
వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ అధికారులతో పాటు డెయిరీ డెవలప్‌మెంట్ ఆధికారులతో సమన్వయం చేసుకోవాలి.
వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలు
– గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నాం.
– అవాంతరాలు లేకుండా ఇంటర్నెట్‌ను అందిస్తాం.
– దీనివల్ల వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్ సాకారం అవుతుంది.
– డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలి.
– తొలివిడతలో భాగంగా 4314 లైబ్రరీలను నిర్మిస్తున్నాం.
– ఈ లైబ్రరీల నిర్మాణానికి సంబంధించి అన్నిరకాల చర్యలు తీసుకోండి.
- సాధ్యమైనంత వేగంగా వీటి నిర్మాణం పూర్తి చేయాలి.
– అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
అగ్రికల్చర్.. ఇ–క్రాపింగ్
– పంట కొనుగోలు జరగాలంటే ఇ– క్రాపింగ్‌చేయాలి.
– ఇ– క్రాపింగ్ చేయించడమన్నది ఆర్బీకేల ప్రాథమిక విధి.
– ఇ– క్రాపింగ్‌పైన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు దృష్టిపెట్టాలి.
-కలెక్టర్లు, జేసీలు గ్రామ సచివాలయాల తనిఖీకి వెళ్లినప్పుడు ఆర్బీకేల తనిఖీ కూడా చేపట్టాలి.
– సీఎం–యాప్ పైన కూడా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలి.
– ఎక్కడ రైతులకు ధరల విషయంలో నిరాశజనక పరిస్థితులు ఉన్నా.. సీఎం యాప్‌ద్వారా... పర్యవేక్షణ చేసి వెంటనే రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలి.
- జేసీ, మార్కెటింగ్ శాఖ అలాంటి పరిస్దితుల్లో వెంటనే జోక్యం చేసుకోవాలి.
- జేడీఏలు, డీడీఏలు కూడా 20 శాతం ఇ -క్రాప్ తనిఖీలు చేయాలి.
- అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు తప్పనిసరిగా 30 శాతం ఇ-క్రాప్ తనిఖీ నిర్వహించాలి.
– ఇ– క్రాపింగ్ చేసిన తర్వాత డిజిటల్ రశీదుతోపాటు, భౌతికంగా కూడా రశీదు ఇస్తున్నారా? లేదా? చూడాలి.
– గ్రామంలోని ప్రతి ఎకరా కూడా ఇ– క్రాపింగ్ జరగాల్సిందే.
– సాగుదారు ఎవరు ? ఏ పంట సాగుచేస్తున్నరన్నది ప్రధానం.
ఆ వివరాలనే నమోదు చేయాలి.
– ఇ– క్రాపింగ్ ఉంటేనే పంటలబీమా, సున్నావడ్డీ, పంటకొనుగోళ్లు, ఇన్‌పుట్‌సబ్సిడీ ... ఇవన్నీకూడా సవ్యంగా జరుగుతాయి.
వ్యవసాయ సలహా మండలి
– అగ్రికల్చర్ అడ్వైజరీ మీటింగ్స్ కచ్చితంగా జరిగేలా చూడాలి.
– నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల స్థాయిలో, రెండో శుక్రవారం మండలస్థాయిలో, మూడో శుక్రవారం జిల్లాల స్థాయిలో అడ్వైజరీ సమావేశాలు జరగాలి.
– నాలుగో శుక్రవారం వ్యవసాయశాఖ కార్యదర్శి సమక్షంలో రాష్ట్రస్థాయిలో సమావేశం జరగాలి.
– ఈ సమావేశాల్లో వచ్చే సలహాలు, సూచనలు కొనసాగాలి.
- ఇవన్నీ కార్యరూపం దాల్చాలి.
ఆర్బీకేలు– సీడ్, ఫెస్టిసైడ్స్ సప్లై..
– విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు నాణ్యమైన వాటిని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయాలి.
– నెల్లూరులో జరిగిన ఘటన నాదృష్టికి వచ్చింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోమని చెప్పాం.
– ఎంప్యానెల్ అయిన కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులనే ఇవ్వాలి.
– సీడ్ కార్పొరేషన్.. ఈ ఉత్పత్తులను సమగ్రంగా పరిశీలించాలి.
- సీడ్ కార్పొరేషన్‌లో ఎంప్యానెల్ అయిన కంపెనీలు మాత్రమే సరఫరా చేయాలి.
- మరెవ్వరూ ఎంప్యానెల్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే సహించేది లేదు.
– ఆర్బీకేల ద్వారా ఇస్తున్న సీడ్, ఫెర్టిలైజర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దు: కలెక్టర్లకు సీఎం ఆదేశం
– కలెక్టర్లు నుంచి మొదలుకుని అందరూ కూడా సమష్టిగా బాధ్యత వహించాలి.
_ పదిహేను రోజులకొకసారి కలెక్టర్లు ఆర్బీకేలపై సమీక్ష నిర్వహించాలి.
– విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఉంచడానికి ఆర్బీకేల్లోనే గోడౌన్లను ఏర్పాటు చేస్తున్నాం.
– అప్పటివరకూ స్టోరేజీకోసం.. అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకోండి.
– నాకు పలానాది కావాలని రైతులు అడిగితే.. కచ్చితంగా సంబంధిత ఆర్బీకే ద్వారా ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సరఫరా కావాలి.
– అందుకనే వీలైనంత త్వరగా ఆర్బీకేలను పూర్తిచేయాలి.
– అంతవరకూ తాత్కాలిక ఏర్పాట్లు పూర్తిచేసుకోండి.
ఆర్బీకేలు– బ్యాంకింగ్ సేవలు
– ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఉంచమని చెప్పాం.
– వారి విధులు, కార్యకలాపాలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి.
– అన్ని ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండేలా చర్యలు తీసుకోండి.
కౌలు రైతులుకూ రుణాలు
– కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు ఇచ్చాం.
– వారికి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
– వారికి రైతు భరోసా సహా.. అన్నిరకాలుగా అండగా ఉంటున్నాం.
– ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తున్నాం, బీమా ఇస్తున్నాం, పంట కొనుగోలుకు కూడా భరోసా ఇస్తున్నాం.
– ఇలాంటి సందర్భాల్లో వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనకడుగు వేయాల్సిన పనిలేదు.
– అందుకే వారికి రుణాలు అందేలా కలెక్టర్లు దృష్టిపెట్టాలి.
– మినిమం సపోర్ట్ ప్రైస్‌కు సంబంధించి మనం హామీ ఇస్తున్న పోస్టర్‌ను ఆర్బీకేల్లో డిస్‌ప్లే చేయాలి.
అధికారులు సందర్శనకు వెళ్లినప్పుడు ఇది కూడా తనిఖీ చేయాలి.
- తద్వారా ఏ పంటకు ఎంత రేటు ఇస్తున్నామన్నది రైతుకు భరోసా ఇచ్చినట్లవుతుంది.
- నవంబర్ నుంచి రబీ పనులు ఊపందుకుంటాయి.
- రబీకి అవసరమైన విధంగా అధికారులు సన్నద్ధంకావాలి.
- 56 లక్షల ఎకరాల్లో సాగవుతుంది, దీనికి సన్నద్ధంగా ఉండాలి.
– 62శాతం మంది ప్రజలు పరోక్షంగా, ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంపైన ఆధారపడి ఉన్నారు.
– ఈ రంగం ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
– దీన్ని ప్రతిక్షణం మీరు మనసులో పెట్టుకోవాలి.
– గ్రామీణ ఆర్థికవ్యవస్థ దీనిమీదే ఆధారపడి ఉంది.
జగనన్న శాశ్వత భూ హక్కు -భూ రక్ష పథకం
– ఈ పథకం విప్లవాత్మకమైనది.
– 100 సంవత్సరాల క్రితం సర్వే అయ్యింది.
– 100 ఏళ్ల తర్వాత సర్వే, రికార్డులను అప్‌డేట్ చేస్తున్నాం.
- దీనికోసం అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నాం.
– గ్రామాల్లో భూ వివాదాలకు పూర్తిగా చెక్ పడుతుంది.
– గ్రామ సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు ఉంటుంది.
– పైలట్‌ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో సర్వే జరుగుతోంది.
– ఇది పూర్తవగానే జాతికి అంకితం చేస్తాం.
_ సమగ్ర సర్వే పూర్తి చేసి, కొత్త పాసుపుస్తకాలు, రికార్డులు, గ్రామంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటవుతుంది.
– మరో 650 గ్రామాల్లో డిసెంబర్‌కల్లా పూర్తవుతుంది.
- తొలిదశలో నిర్ణీత కాలపరిమితితో 5500 గ్రామాల్లో సర్వే పూర్తవుతుంది.
– 2023 జూన్‌కల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్త సర్వే ప్రక్రియ ముగుస్తుంది.
- ప్రతి గ్రామంలోనూ ప్రతి సచివాలయంలోనూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వస్తుంది.
– కలెక్టర్లు, జాయింట్‌కలెక్టర్లు అంకిత భావంతో దీన్ని అమలు చేయాలి.
– సర్వే అవగానే రికార్డులు అప్‌డేట్ అవుతాయి, కొత్త పాసుపుస్తకాలు యజమానులకు ఇస్తాం.
ఈ కార్యక్రమం పూర్తయ్యే నాటికి చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సీఎం సమీక్ష
– ఈ పథకం వల్ల లక్షలమంది పేదలకు ఉపయోగం కలుగుతుంది.
_ లక్షలాది పేద కుటుంబాలకు టైటిల్ డాక్యుమెంట్లు లేవు, ఫలితంగా భూమి రిజిస్ట్రేషన్ కాదు.
–ఈ పథకం వల్ల 47.4 లక్షల మంది లబ్ధి పొందుతారు.
– పట్టాలు వీరిచేతికి అందుతాయి.
– వారి ఇంటి స్థలంమీద వారికి అన్నిరకాల హక్కులు వస్తాయి.
– ఇది చాలా పెద్ద కార్యక్రమం, దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి.
– ఈ పథకంమీద క్రమం తప్పకుండా సీఎస్‌గారు కూడా రివ్యూ చేస్తారు.
– డిసెంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
గ్రామ, వార్డు సచివాలయాలు–తనిఖీలు
– కలెక్టర్లు వారానికి కనీసం రెండు గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీ చేయాలి.
– జేసీలు కనీసం 4 గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీ చేయాలి.
– మున్సిపల్ కమిషనర్లు, ఐటిడీఏ పీఓలు, సబ్‌కలెక్టర్లు కూడా కనీసం 4 గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీ చేయాలి.
– గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు బాగా మెరుగుపడ్డాయి.
– తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్ పరిశీలన తప్పనిసరి.
– తనిఖీలకు వెళ్లినప్పుడు గతంలో వ్యక్తంచేసిన సమస్యలను పరిష్కరించామా? వాటిని సరిచేశామా? లేదా? చూడాలి.
– రిజిస్టర్‌లో పేర్కొన్న అంశాలను సచివాలయాల విభాగాధిపతికి పంపించాలి.
– అలాగే ఏదైనా పరిష్కరించాల్సిన కొత్త అంశాన్ని గుర్తిస్తే.. వాటిని కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలి.
– గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేసినప్పుడు గుర్తించిన అంశాలు, సమస్యలను పరిష్కరిస్తున్నారా? లేదా? వాటిపై దృష్టిపెడుతున్నారా? లేదా? అన్నదానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
– దీనికి సంబంధించిన ప్రోటోకాల్‌ను తయారుచేయాలి.
– ఆ ప్రోటోకాల్‌ను పాటిస్తున్నారా? లేదా? కచ్చితంగా చూడాలి.
– దాదాపు 80 శాతం సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనపరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందని చెప్తున్నారు.
– మిగిలిన 20 శాతం మంది సచివాలయాల సిబ్బందికి కూడా వారు పనితీరును మెరుగుపరిచేలా మనం వారికి తోడ్పాటును అందించాలి.
– నూటికి నూరు శాతం గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును చూపించేలా సిబ్బందికి తగిన చేయూతను, తోడ్పాటును అందించాలి.
కలెక్టర్లే ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి.
– వాలంటీర్ల సేవలపైన కూడా దృష్టిపెట్టాలి.
– వారు మెరుగైన సేవలు అందించేలా వారికి కౌన్సెలింగ్ చేయాలి.
– వారు అప్‌గ్రేడ్ అయ్యేలా చూడాలి.
– అందుకు వారికి చేయూతనిచ్చి.. తీర్చిదిద్దాలి.
– అప్పటికీ కూడా సేవలను అందించడంలో వారు ప్రమాణాలను అందుకునే రీతిలో లేకపోతే వారిని తొలగించి కొత్తవారిని పెట్టాలి.
– ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులను కూడా భర్తీచేయాలి.
వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
– అలాగే సచివాలయాలకు అందుతున్న విజ్ఞాపనలు, వినతుల పరిష్కారంపైకూడా దృష్టిపెట్టండి.
_ సచివాలయాల్లో తిరస్కరణకు గురైన లబ్దిదారులపై కూడా దృష్టి సారించాలి.
– గ్రీవెన్స్ రిడ్రెసల్ యంత్రాంగం సమర్థవంతంగా ఉండాలి.
– సిటిజన్ అవుట్‌రీచ్ కార్యక్రమం అక్టోబరు 29, 30 తేదీల్లో చేపట్టాలి.
– సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.. బృందాలుగా ఏర్పడి వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలి.
– గతంలో జరిగిన అవుట్‌రీచ్ కార్యక్రమంలో కొన్నిచోట్ల కేవలం వాలంటీర్లు మాత్రమే కలిసినట్టు నా దృష్టికి వచ్చింది. అలా జరగడానికి వీలులేదు.
– కచ్చితంగా సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల బృందాలుగా ఏర్పడి.. కుటుంబాలను కచ్చితంగా కలవాలి.
– ప్రతినెలలో తొలి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలి.
– సిబ్బంది, వాలంటీర్లు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనాలి.
సచివాలయాల మౌలిక సదుపాయాలపైనా దృష్టి..
– సచివాలయాల్లోని మౌలిక సదుపాయాలు, పరికరాలు కచ్చితంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి.
– మొబైల్స్, గౌరవవేతనం, సీఎఫ్‌ఎంస్ ఐడీలు, సిమ్‌కార్డులు, ఫింగర్‌ప్రింట్ స్కానర్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలి.
– నెలలో రెండో బుధవారం మండలం లేదా యూఎల్‌బీ స్థాయిలో సమావేశం జరగాలి.
– నెలలో మూడో బుధవారం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలోసమావేశం కావాలి.
– నాలుగో బుధవారం రాష్ట్ర స్థాయిలో సచివాలయాల విభాగానికి చెందిన కార్యదర్శి సమావేశం కావాలి.
– అప్పుడే మనకు ప్రతి సచివాలయంలో ఉన్న వాస్తవ పరిస్థితి తెలుస్తుంది.
– వాలంటీర్లుకు గౌరవవేతనం వస్తుందా ? లేదా ? ఫింగర్ ప్రింట్ స్కానర్ పనిచేస్తుందా ? లేదా ? సదరు సచివాలయంలో కనెక్టివిటీ ఉందా? లేదా? అన్నది తెలుస్తుంది.
వాటిని మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
– ప్రతి ఏటా రెండు సార్లు జూన్, డిసెంబరుల్లో పెన్షన్లు, రేషన్‌కార్డులు, పట్టాలు తదితర పథకాలకు సంబంధించి మంజూరు ఉంటుంది.
– దీన్ని కచ్చితంగా అమలు చేయాలి: సీఎం ఆదేశం
రైతు భరోసా
– అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత కార్యక్రమంజ.
– 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు.
– అర్హులెవరూ మిగిలిపోకూడదు, అనర్హులకు అందకూడదు.
– ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించి చర్యలు తీసుకోండి.
- నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయాలి : కలెక్టర్లకు సీఎం నిర్దేశం
స్పందన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సర్వే, సెటిల్‌మెంట్స్ కమిషనర్ సిద్ధార్ధజైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం ఎం నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.