ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌పై దృష్టిపెట్టాలి

కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: కోవిడ్‌ – 19 నివారణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారు. కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌పై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఏ. మల్లికార్జున్, పలువురు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

Back to Top