పార్టీ ఎంపీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడనున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీకి  ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకువచ్చేలా సీఎం వైయస్‌ జగన్‌ ఎంపీలను ఆదేశించనున్నారు. అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల సాధన అజెండాగా సమావేశం జరగనుంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన సహాయంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీలతో సీఎం చర్చించనున్నారు. అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్‌లో వినియోగించుకునేలా ఎంపీలకు సీఎం వైయస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.
 

Back to Top