కాసేప‌ట్లో క‌లెక్ట‌ర్ల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

తాడేప‌ల్లి: క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడ‌నున్నారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై జిల్లాల్లో ప‌రిస్థితిపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షించ‌నున్నారు. అదే విధంగా ఉపాధి హామీపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఖ‌రీఫ్ సీజ‌న్‌, ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించ‌నున్నారు. అదే విధంగా పాఠ‌శాల‌ల్లో నాడు-నేడు ప‌నుల‌పై కూడా సీఎం ఆరా తీయ‌నున్నారు.

Back to Top