వైద్యం కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదు

ఏపీ చరిత్రలో వైద్య రంగంలో ఈ రోజు ప్రత్యేకం

కొత్తగా 1,088 అంబులెన్స్‌లను ప్రారంభించాం

108, 104 అంబులెన్స్‌లను ఆధునీకరించి ప్రారంభించాం

గుంటూరు జీజీహెచ్‌లో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను ప్రారంభించిన సీఎం

మరో ఏడాదిలో కర్నూలులో కూడా కేన్సర్‌ విభాగం

తొలి సారిగా ఫ్యామిలీ డాక్టర్‌ విభాగం తీసుకువస్తున్నాం

రోగుల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డుల ఏర్పాటు

రాష్ట్రంలో కోటి 42 లక్షల మందికి హెల్త్‌ కార్డులు అందించాం

గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో దారుణంగా ఉండేవి

ఆసుపత్రులోల విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు శ్రీకారం

ప్రభుత్వ ఆసుపత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

పట్టణాల్లో ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో అంబులెన్స్‌ వస్తుంది

104, విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీలను అనుసంధానం చేశాం

ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస జగన్‌ మోహన్‌ రెడ్డి

 

తాడేపల్లి: వైద్యం కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో వైద్య రంగంలో ఈ రోజు ప్రత్యేకమైందన్నారు. ఉదయం విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో 1068 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభించారు. అనంతరం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గుంటూరులోని జీజీహెచ్‌ ఆసుపత్రిలో కేన్సర్‌ విభాగాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సంరద్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

చాలా ఆనందంగా ఉంది..
ఈ రోజు చాలా ఆనందాన్ని ఇచ్చిన రోజు..ఎందుకంటే చరిత్రలో చెప్పుకొదగ్గ గొప్ప రోజుల్లో ఈ రోజు కచ్చితంగా ఉంటుంది. మొట్ట మొదటిగా డాక్టర్స్‌ డే సందర్భంగా రాష్ట్రంలోని డాక్టర్స్‌కే కాకుండా తెలుగు డాక్టర్స్‌ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా..గుంటూరులోని జీజీహెచ్‌లో రూ.50 కోట్ల నిధులతో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఏపీ సర్కార్, నాట్కో ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో కేన్సర్‌ విభాగం ఏర్పాటు చేశారు. అనంతరం సీఎం మాట్లాడారు. ఈ రోజు క్యాన్సర్‌కు సంబంధించి విభాగం మొదలు పెడుతున్నాం. ఇటువంటి క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉండటం ఇది మొట్ట మొదటి సారి. మూడు విభాగాలు ఈ సెంటర్లో అందుబాటులో ఉంటాయి. రెడియోథెరఫీకి సంబంధించి రెండు సీట్లు కూడా సాధించాం. ఇది గొప్ప విజయం. ఇది రావడానికి వెంకయ్య చౌదరి ముందుకు రావడం, మరో రూ.25 కోట్లతో హై ఎక్యూప్‌మెంట్‌ను ప్రభుత్వమే తీసుకురావడం జరిగింది. ఇలాంటిది త్వరలో కర్నూలులో కూడా నిర్మిస్తున్నాం. డాక్టర్స్‌ డే రోజు ఇలాంటి కార్యక్రమం చే సుకోగా, మరో గొప్ప కార్యక్రమం ఈ రోజు పొద్దునే దాదాపుగా 1068 అంబులెన్స్‌లను ప్రారంభించాం. కొత్త వాహనాలు రోడ్డుపై వెళ్తుంటే మనసుకు ఆనందం కలిగించింది. విజయవాడ నుంచి వివిధ జిల్లాలకు అంబులెన్స్‌లు వెళ్తున్నాయి. ఇంత అధునాతన అంబులెన్స్‌లు ఈ స్కెల్‌లో సింగిల్‌ డేలో పంపించడం అన్నది చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. మనసుకు ఆనందాన్ని కలిగించే ఘట్టం ఏంటంటే..పసి పిల్లలకు సంబంధించి జిల్లాకు రెండు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. చిన్న చిన్న పిల్లల జీవితాలలో ఆనందం నింపేందుకు నియోనెట్‌ అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం. 

యూకే తరహాలో ఫ్యామిలీ డాక్టర్‌ విభాగం
రాష్ట్రంలో మొదటి సారి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌ను, ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డును కూడా క్రియేట్‌ చేశామని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రతి పీహెచ్‌సీ సెంటర్‌కు ఇద్దరు డాక్టర్లు ఉంటారు. 104లో మరో డాక్టర్‌ ఉంటారు. ఈ ముగ్గురు డాక్టర్లకు ఐదు గ్రామాల చొప్పున కేటాయిస్తాం. ఆ డాక్టర్‌ నెలకు ఒకసారి ఆ ఊరికి వెళ్తారు. ప్రతి వ్యక్తిని ఎలక్ట్రానిక్‌ డేటాలో ఏంట్రీ చేస్తారు. మందులు ఇస్తారు. మిగిలిన రోజు ఆ డాక్టర్‌ పీహెచ్‌సీ సెంటర్‌లో అందుబాటులో ఉంటారు. యూకే మాదిరిగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను క్రియేట్‌ చేస్తున్నాం. రాష్ట్రంలో 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డులు అందజేశాం. క్యూ ఆర్‌ కోడ్‌తో రూపొందించిన ఈ ఆరోగ్యశ్రీ కార్డులో ప్రతి ఒక్కరి హెల్త్‌ రికార్డు ఉంటుంది. ప్రతి రోగి డిజిటల్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డు అందుబాటులో ఉంటుంది. రాబోయే రోజుల్లో వచ్చే విలేజీ క్లినిక్స్‌కు 104ను అనుసంధానం చేస్తున్నాం. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాం. 
గతానికి, ఈ రోజుకు ఉన్న తేడాను అందరూ గమనించాలి. గతంలో ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందో గుర్తుకు తెచ్చుకోండి. గతంలో ఎలుకలు కొరికి చిన్న పిల్లలు చనిపోయారు. సెల్‌ఫోన్‌ వెలుతురులో ఆపరేషన్లు చేశారు. గతంలో 108 వాహనాలు అరకొరగా నడిచేవి. గతంలో కండిషన్‌లో ఉన్నవి 336 మాత్రమే. ఆసుపత్రుల్లో పూర్తిగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఈ రోజు 1068 వాహనాలతో శ్రీకారం చుట్టాం. ఈ అంబులెన్స్‌లు సరైన సమయానికి చేరకపోతే మనుషుల ప్రాణాలు పోతాయి. ఈ పరిస్థితిని పోగొట్టేందుకు నమ్మకం, భరోసా కల్పించే కార్యక్రమం చేశాం. పట్టణ ప్రాంతాల్లో 108కు ఫోన్‌ కొడితే 15 నిమిషాల్లో వస్తుందని, గ్రామీణ ప్రాంతాలకు 20 నిమిషాల్లో వస్తుందని భరోసా కల్పిస్తున్నాం. ప్రతి అంబులెన్స్‌లో కూడా బేషిక్‌ లైవ్‌ సపోర్టు వాహనాలు ఏర్పాటు చేశాం. ఇలాంటి వాహనాలు గతంలో 86 మాత్రమే ఉండేవి. కొత్తగా మనం సిద్ధం చేసిన వాహనాల్లో 300పైగా వాహనాలు బేసిక్‌ లైవ్‌ సపోర్టు వాహనాలు ఉన్నాయి. మరో 26 వాహనాలు చిన్నారుల కోసం ఏర్పాటు చేశాం. అంబులెన్స్‌లో ఇవాళ కేమెరాలు కూడా ఏర్పాటు చేశాం. 108 వాహనం ఎక్కిన వెంటనే రోగి పరిస్థితి ఏంటని వీడియో కెమెరా ద్వారా రోగిని చూస్తారు. సలహాలు, సూచనలు కూడా డాక్టర్లు ఇస్తారు. ఇలాంటివి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏవీఎల్‌ సిస్టమ్, డిస్‌ఫ్లే ఉంటుంది. 

మాటల్లో కాదు..చేతల్లో చూపించాం..
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను మాటల్లోనే కాదు..దేవుడి దయతో మీ అందరి చల్లని చూపులతో చేతల్లో కూడా చూపించగలిగాం. నాడు–నేడు ద్వారా జాతీయప్రమాణాలు ఉండేలా ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నాం. ప్రతి ఊర్లోనూ రాబోయే రోజుల్లో విలేజీ క్లినిక్స్‌ కనిపిస్తాయి, పీహెచ్‌సీలను కూడా నాడు–నేడు ద్వారా జాతీయ ప్రమాణాల్లోకి తీసుకెళ్తాం. టీచింVŠ  ఆసుపత్రులను కూడా తీర్చిదిద్దుతాం. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటికీ 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే..రాబోయే మూడేళ్లలో మరో 16 టీచింగ్‌ ఆసుపత్రులను, మెడికల్‌ కాలేజీలను తీసుకువస్తాం. ప్రతి పార్లమెంట్‌లో ఒక టీచింగ్, నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని గర్వంగా చెబుతున్నాం. పట్టించుకోని పరిస్థితిలో ఉన్న ట్రైబల్‌ ఏరియాల్లో ఏడు మల్టి స్పెషాలిటీ ఆసుపత్రులను కడుతున్నాం. కిడ్నీ ఆసుపత్రులు కూడా నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ రూపురేఖలను పూర్తిగా మార్చే కార్యక్రమం జరుగుతోంది. గతంలో నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు ఇచ్చేవారు కాదు. మనం అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలు చెల్లించాం. ఈ రోజు చిరునవ్వుతో నెట్‌వర్క్‌ ఆసుపత్రులను మార్చేశాం. పేదవారికి ఎలా వైద్యం అందించాలనే ఆరాటంతో మార్పులు చేస్తూ ఆరోగ్యశ్రీని రూపొందించాం. ఆపరేషన్‌ చేయించుకున్న తరువాత విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా రోగికి డబ్బులు ఇస్తున్నాం. నెలకు రూ.5 వేల చొప్పున ఆరోగ్య ఆసరా పేరుతో ఇస్తున్నాం. జులై 8వ తేదీ నుంచి మరో ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కింద 2059 రోగాలను పెంచుతున్నాం. నవంబర్‌ 14 నాటికి రాష్ట్రంలోని అందరికీ ఆరోగ్యశ్రీ కింద 2059 రోగాలను పెంచుతాం. ఆరోగ్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు చేరుస్తున్నాం. పక్క రాష్ట్రంలోని మంచి ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. ఇవన్నీ కూడా అందరూ ఆలోచన చేయాలని కోరుతున్నాం. దేవుడి దయతో ఈ రోజు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని దేవుడిని కోరుకుంటున్నా..
 

Back to Top