క‌లెక్ట‌ర్ల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

అమ‌రావ‌తి:  భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు, వైయ‌స్ఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. వాయు గుండం ప్రభావంతో.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ సమీపంలో విస్తారంగాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని , అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.  కాగా, ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకుని సహయ కార్యక్రమాలు చేపట్టాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు.
 

తాజా ఫోటోలు

Back to Top