కరోనాను నియంత్రించకపోతే ముందుకు సాగలేం

లాక్‌డౌన్‌ నుంచి సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా చర్యలు తీసుకోవాలి

కరోనాతో కలిసి ముందుకు సాగాల్సిందేనన్న అవగాహన కల్పిస్తున్నాం

రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాం

కొత్త రాష్ట్రంగా మాకు కేంద్రం సహకారం కావాలి

ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌ జగన్

 తాడేపల్లి: కరోనాను నియంత్రించకపోతే ముందుకు సాగలేమని ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ  ఐదోసారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం వైయస్‌ జగన్ పాల్గొని రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ..లాక్‌డౌన్‌ కొనసాగింపు, సడలింపులపై పలు సూచనలు చేశారు.  కేంద్రం సూచనలకు అనుగుణంగా రెండు నెలల నుంచి చర్యలు తీసుకున్నామని, ‘కరోనా’ను నియంత్రించగలిగామని మోదీకి సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు.  ఏపీలో మూడు సార్లు సమగ్ర సర్వే నిర్వహించామని, 30 వేల మందిలో వైరస్ లక్షణాలు కనిపించడంతో వారందరికీ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా చర్యలు తీసుకోవాలని, ‘కరోనా’ను నియంత్రించలేకపోతే ముందుకు వెళ్లలేమని సీఎం వైయస్‌ జగన్ ప్రధాని మోదీకి చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే..

 • ఇప్పుడున్న వైద్య విధానం, వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావాలి
 • ప్రజారోగ్య రంగం బలోపేతానికి ఇచ్చే రుణాలు, దీర్ఘకాలిక చెల్లింపుల ప్రాతిపదికన రుణాలు ఇవ్వాలి.
 • ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లు, క్వారంటైన్‌ బెడ్లు ఇంకా పెంచాల్సి ఉంది
 • గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లు, పార్లమెంట్‌ నియోజకవర్గంలో వైద్య కాలేజీలు ఏర్పాటు చేయాలి
 • గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ఎక్కువగా నిర్వహించాలి
 • తయారీ రంగం పుంజుకోవాలంటే ముడి సరుకులు అందడం ప్రజల కదలికలు అత్యవసరం
 • సరుకుల రవాణాకు అనుమతించినప్పటికీ చాలా రాష్ట్రాల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయి
 • ఏపీలో తయారీరంగం పూర్తిగా స్తంభించిపోయింది. 
 • దేశవ్యాప్తంగా మార్కెట్లు, రిటైల్‌ మార్కెట్లు మూతపడటంతో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెంటింగ్‌ లేదు. ఆ ప్రభావం రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తులపై కనిపిస్తోంది.
 • రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులను దృష్టిలో ఉంచుకొని ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాం.
 • రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి పూర్తి అవరోధాలు తొలగిపోవాలి.
 • ప్రజా రవాణా రంగంపై ఉన్న ఆంక్షలను తొలగించాలి
 • ఆసుపత్రులు, ఆరోగ్య, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రూ.16 వేల కోట్లు ఖర్చు అవుతుంది
 • చిన్న తరహా పరిశ్రమలను కాపాడుకునేందుకు ఆరు నెలలు వడ్డీ మాఫీ చేయాలి
 • ఉద్యాన వన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలి, 50 శాతానికి పెంచాలి.
 • ప్రజలు భౌతిక దూరం పాటించేలా వ్యూహం రూపొందించాలి
 • హోం ఐసోలేషన్‌ సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం
 • హైరిస్క్‌ ఉన్నవారికీ మరింత అవగాహన కల్పిస్తున్నాం
 • టెలీమెడిసిన్‌ కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేశాం
 • బహిరంగ ప్రదేశాల్లో స్పష్టమైన ప్రామాణికత రూపొందించాలి
 • వర్క్‌ ప్లేస్‌, మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌లు, మార్కెటులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యమైనవని సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి వివరించారు. 
Back to Top