పరిశ్రమలకు సీఎం వైయస్‌ జగన్‌ భరోసా 

చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వ తోడ్పాటు

గత ప్రభుత్వ బకాయిలు రూ.827 కోట్లుతో పాటు మొత్తం రూ.905 కోట్ల ప్రోత్సాహకం

10 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

 జేసీ పర్యవేక్షణలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భరోసా

పరిశ్రమల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆదుకోవాలి

మూడు నెలల స్థిర విద్యుత్‌ ఛార్జీలు రూ.188 కోట్లు మాఫీ

నిర్వహణ మూలధనం రుణాలకు రూ.200 కోట్లతో నిధి

75 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు చేసేలా చర్యలు 

రాష్ట్రంలో 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు ఏర్పాటు

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, పారిశ్రామికవేత్తలతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖి

తాడేపల్లి: రాష్ట్రంలోని సుక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూర్తి భరోసా ఇచ్చారు. పరిశ్రమల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా గత ప్రభుత్వహయాంలోని బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలు మూతపడి నష్టాల్లో ఉండటంతో విద్యుత్‌ ఛార్జీలు మూడు నెలల పాటు మాఫీ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోనే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యం గల కార్మికులు అవసరమో గుర్తించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం చేయూతనిచ్చింది. గత ప్రభుత్వ బకాయిలు రూ.827 కోట్లతో పాటు మొత్తం రూ.905 కోట్ల ప్రోత్సాహకం అందిస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడతలో రూ.450 కోట్లను సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎంఎస్‌ఎంఈ నిర్వాహకులతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

ఎంఎస్‌ఎంఈ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
ఈ రోజు చేపట్టిన కార్యక్రమం పూర్తిగా ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో  98 వేల ఎంటర్‌ప్రైజేస్‌ ఉన్నాయి. వీటిలో దాదాపు కార్మికులు 10 లక్షల మంది పని చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ లోకల్‌ ఎంప్లాయిమెంట్‌ క్రియేట్‌ చేస్తున్న వ్యవస్థ, ప్రైవేట్‌ రంగంలో ఎక్కువ ఉపాధి కల్పించే రంగం ఎంఎస్‌ఎంఈ సెక్టారే. ఈ రంగాన్ని కాపాడుకోకుంటే నిరుద్యోగ సమస్య వస్తుంది. కలెక్టర్లు దీనిపై ప్రత్యేక ధ్యాస పెట్టాలి. ఈ రంగానికి ప్రత్యేక అధికారిని నియమించి, బాధ్యతలు అప్పగించాలి.  పరిశ్రమల కార్యదర్శికి కూడా ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని చెబుతున్నాను. వాళ్ల సమస్యలను పరిష్కరిస్తూ, అన్ని రకాలుగా తోడుగా ఉండాలి. అందరూ కలెక్టర్లు వీటిపై ప్రత్యేక ధ్యాస, శ్రద్ధ చూపాలి.

ఇన్‌సెంటివ్స్‌ ఇవ్వకపోతే నష్టపోతాయి..
ఈ పరిశ్రమల్లో ఉన్న పరిస్థితులు గమనిస్తే.. ఈ రంగం పూర్తిగా కుదేలు అయ్యింది. లాక్‌డౌన్‌లో ఇంకా ఎక్కువ కుదేలైంది. వీటిని నిలబెట్టగలిగితేనే వ్యవసాయ రంగంపై కొద్దో గొప్పో ఒత్తిడి తగ్గుతుంది. ఇటువంటి రంగానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రీయల్‌ ఇంటెన్సీవ్‌ కింద సహాయం చేస్తామని చిన్న చిన్న వ్యక్తులతో పరిశ్రమలు పెట్టించింది. ప్రభుత్వం ఇన్‌సెంటివ్‌ ఇవ్వకపోతే ఏ విధంగా నష్టపోతారో అన్నది మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలే నిదర్శనం. వీళ్ల బాగోగులు అర్థం చేసుకొని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా , మీకున్న సమస్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని, మీకు తోడ్పాటునందిస్తున్నాం. చిన్న, చితక పరిశ్రమలకు సంబంధించి ఇండస్ట్రీయల్‌ ఇన్‌సెంటివ్స్‌ 2014-2015లో రూ. 45 కోట్లు రాయితీలు ఉన్నాయి, 2015-2016లో రూ.70 కోట్లు, 2016-2017లో రూ.195 కోట్ల బకాయిలు. 2017-2018లో రూ.207 కోట్లు, 2018-2019లో ఇవ్వాల్సిన బకాయిలు చూస్తే రూ. 313 కోట్లు ఉన్నాయి. మొత్తంగా ఐదేళ్లలో ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ఎగురగొట్టిన బకాయిల సొమ్ము అక్షరాల రూ.828 కోట్లు ఉన్నాయి. మనం అధికారంలోకి వచ్చిన తరువాత 2019-2020లో కలిపి మొత్తంగా రూ.905 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ రోజు సగం సొమ్ము అంటే రూ.450 కోట్లు అందజేస్తున్నాం. మరో రూ.450 కోట్లు రేపు నెల 29న ఇవ్వడానికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేశాం. దాదాపుగా రూ.905 కోట్ల బకాయిలు చెల్లించి పరిశ్రమలకు తోడుగా ఉండేందుకు అడుగులు ముందుకు వెస్తున్నాం. ఈ డబ్బు పరిశ్రమలకు ఉపయోగపడుతుందని, వీటిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. 

ఇంకా ఏం చేస్తే బాగుంటుంది..
ఈ పరిశ్రమలను నిలబెట్టేందుకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేశాం. కరోనా సమయంలో పరిశ్రమలు పూర్తిగా మూత వేయాల్సిన నేపథ్యంలో ఇబ్బందులు అధికమయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో తోడుగా ఉండేందుకు ఆలోచన చేస్తే..కరెంటు చార్జీలు తగ్గిస్తే బాగుంటుందని భావించాం. ఈ సమయంలో కరెంటు బిల్లులు ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలకు సంబంధించిన రూ.180 కోట్లు పూర్తిగా మాఫీ చేస్తున్నాం. ఈ డబ్బులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది.  పరిశ్రమలకు భరోసా కల్పించేందుకు చెప్పే మాటలు  ఇవి. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులకు మేలు చేసే కార్యక్రమాలు ఇవన్నీ. 

రూ.200 కోట్లతో కర్ఫస్‌ ఫండ్‌..
ఇవే కాక ఇంకా ఏం చేస్తే పరిశ్రమలకు మేలు చేస్తామన్న ఆలోచన చేస్తే..వీళ్లందరినీ ఆదుకునేందుకు వర్కింగ్‌ కాపిటల్‌ రుణాలు ఇప్పించే విధంగా అడుగులు వేస్తున్నాం. చిన్న, చితక పరిశ్రమలకు మంచి చేసేందుకు రూ.200 కోట్లతో  ఒక కర్పస్‌ ఫండ్‌ క్రియేట్‌ చేసి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే దగ్గరుండి చేస్తుంది. ఈ రుణాలపై ఆరు నెలల పాటు మారిటోరియం ఉంటుంది. ఆ తరువాత మూడేళ్లలో తక్కువ వడ్డీతో ఈ రుణాలు తిరిగి చెల్లించవచ్చు. ఇదొక్కటే కాదు. ఇంకా ఏం చేస్తే పరిశ్రమలను రక్షించుకోగలుగుతామని ఆలోచన చేస్తే..వచ్చిన సలహాల మేరకు ప్రత్యేకమైన పరిస్థితిలో పరిశ్రమలకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వం దాదాపుగా 300 రకాల వస్తువులు ఈ పరిశ్రమల ద్వారా కొనుగోలు చేయవచ్చు అని గుర్తించారు.  25 శాతం సుక్ష్మ, చిన్న పరిశ్రమల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీటిలో కూడా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పరిశ్రమలు ఉంటాయో..వారి వద్ద నుంచి 4 శాతం కచ్చితంగా కొనుగోలు చేయాలని, మహిళలు నడిపే పరిశ్రమల నుంచి కచితంగా 3 శాతం కొనుగోలు చేయాలని ఆదేశించాం. వీరు ఎలాంటి అవస్థలు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన వస్తువులకు 45 రోజుల్లో బిల్లులు చెల్లించేందుకు జీవో జారీ చేశాం. రాష్ట్రం పరిధిలో ఎక్కడైతే మేలు చేయగలుగుతామో పరిగణలోకి తీసుకున్నాం. కచ్చితంగా ఒక జేసీకి పరిశ్రమలకు సంబంధించి బాధ్యతలు అప్పగించండి. వాళ్ల ఇబ్బందులను మానవతాదృక్ఫథంతో ఆలోచన చేయండి. ప్రభుత్వం వీరికి తోడుగా ఉండేందుకు సిద్ధంగా ఉంది. యువకుడు, మంచి వ్యక్తి మంత్రిగా ఉన్నారు. అధికారులు కూడా మంచి వ్యక్తులు ఉన్నారు. సాల్మన్‌కు కూడా తోడుగా ఉండమని చెప్పాం. ప్రతి అవసరం తీర్చే విధంగా అడుగులు వేయాలని కలెక్టర్లను ఆదేశిస్తున్నా.

ఎలాంటి నైపుణ్యం అవసరమో గుర్తించాలి..
పరిశ్రమలలో పని చేసే వలస కూలీలు కు 2.80 లక్షల మంది  వారి రాష్ట్రాలకు వెళ్లారు. మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లిన వారు కూడా తిరిగి వచ్చారు. ప్రతి పరిశ్రమలోనూ స్కిల్‌ గ్యాప్‌పై అధ్యాయనం చేయండి. ఎలాంటి భర్తీలు చేయాల్సి ఉంది. ఆ పరిశ్రమలో ఎలాంటి నైపుణ్యం అవసరమో గుర్తించి..మనమే అలాంటి వారిని పరిశ్రమలకు అందిద్దాం. రాబోయే రోజుల్లో 75 శాతం స్థానికులకే పరిశ్రమల్లో అవకాశం కల్పించాలని చట్టం చేశాం. ఈ అమలులో మనం ఏం చేయాలో ఆలోచన చేయండి. ప్రతి పార్లమెంట్‌లో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమలకు కావాల్సిన స్కిల్‌ను మనవాళ్లకే ట్రైనింగ్‌ ఇప్పిద్దాం. వీటిపై జేసీలు ఎక్కువ ధ్యాస పెట్టే విధంగా చూడండి. వీటి వల్ల పరిశ్రమలకు మంచి జరగాలని, మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top