వైయస్‌ఆర్‌ స్టేడియంలో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

మహిళా క్రికెటర్లు ష‌బ్నం, అంజిలికి రూ.10 ల‌క్ష‌ల చొప్పున న‌గ‌దు బ‌హుమ‌తి అంద‌జేత‌

ఏపీఎల్‌ సీజన్‌–2ను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

విశాఖపట్నం: పీఎం పాలెంలోని వైయస్‌ఆర్‌ స్టేడియం ప్రాంగణంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వైయస్‌ఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిష‌న్‌ను తిల‌కించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌ను ప‌రిచ‌యం చేసుకొని వారితో గ్రూప్ ఫొటో దిగారు. అదే విధంగా ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో నిర్వహిస్తున్న ఏపీఎల్‌ సీజన్‌–2ను ప్రారంభించారు. అండ‌ర్ - 19 మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాల్గొన్న‌ మహిళా క్రికెటర్లు ష‌బ్నం, అంజిలిని సీఎం వైయస్‌ జగన్‌ అభినందించి ఘనంగా సత్కరించారు. వారికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతిని అందజేశారు. అనంత‌రం ఏపీఎల్ సీజ‌న్‌-2 రంజీ ప్లేయ‌ర్ల‌తో మాట్లాడి వారితో గ్రూప్ ఫొటో దిగారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు, అధికారులు ఉన్నారు. 

Back to Top