మీకు సేవచేసే భాగ్యాన్ని క‌ల్పించినందుకు కృత‌జ్ఞ‌త‌లు

మూడేళ్ల పాల‌న‌లో ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేసి నేటితో మూడేళ్లు పూర్త‌యింది. మూడేళ్ల ప‌రిపాల‌న పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  

Back to Top