ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు రామ‌మూర్తి

తెలుగు భాషా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. గిడుగు రామ‌మూర్తి పంతులు జ‌యంతి సంద‌ర్భంగా అంద‌రికీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలుగు భాషా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. ``ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. గిడుగువారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు`` తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు. 

Back to Top