మీ దీవెన‌ల‌తో.. మ‌రింత మంచి చేసేందుకు కృషిచేస్తా

ఉప ఎన్నిక‌లో ఘ‌న విజ‌యాన్ని అందించిన బ‌ద్వేల్ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించిన డాక్ట‌ర్ సుధ‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభినందించారు. ఘ‌న విజ‌యాన్ని అందించిన బ‌ద్వేల్ ప్ర‌జానీకానికి పేరుపేరునా సీఎం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను`` అని సీఎం ట్వీట్ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top