పేదరికాన్ని అధిగమించే శక్తి ‘చదువు’కే ఉంది

రాష్ట్రం 100 శాతం అక్షరాస్యత సాధించే దిశగా అడుగులు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌

తాడేపల్లి: పేదరికం, అసమానతలను అధిగమించడంలో విద్య ముఖ్య భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చగల, సాధికారికత చేకూర్చగల శక్తి చదువుకు ఉందన్నారు. అంతటి ప్రాముఖ్యం గల విద్యను ప్రతి ఒక్కరికి అందించేందుకు అమ్మ ఒడి, నాడు– నేడు, విద్యా దీవెన తదితర పథకాలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు చేపట్టి, 100 శాతం అక్షరాస్యత సాధించేలా రాష్ట్రాన్ని నడిపించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top