ఇలాంటి ఘటన పునరావృతం కాకూడదు

కోవిడ్‌ రోగి మృతదేహాన్ని జేసీబీలో తరలించడంపై సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ 

తాడేపల్లి: కరోనా వైరస్‌ సోకి మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని పై సీఎం వైయస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్‌ రోగి మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంత మంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదు’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
 

Back to Top