రెజ్ల‌ర్ ర‌విదాహియాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

అమ‌రావ‌తి: టోక్యో ఒలింపిక్స్ లో రెజ్లింగ్ క్రీడాంశంలో రజతం సాధించిన రవికుమార్ దహియాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు.   రవికుమార్ దహియా  టోక్యో ఒలింపిక్స్ లో విశేష ప్రతిభ కనబర్చి  57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో రజతంతో మెరిశాడు.  ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. టోక్యో 2020 లో భారతదేశానికి రెండవ రజత పతకాన్ని సాధించినందుకు రెజ్లర్  రవిదాహియాకు అభినందనలు. ఒలింపిక్స్ అరంగేట్రంతోనే తనదైన ముద్ర వేసిన ఈ యువ చాంప్‌ను చూసి భారతదేశం గర్విస్తుంద‌న్నారు.  తన ప్రయాణం అద్భుతంగా ఉండాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top