సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ నా సెల్యూట్‌

ట్విట్టర్‌లో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
 

తాడేపల్లి: జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలంతా ఇంట్లో ఉంటే.. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు పనిచేస్తున్న సిబ్బందికి సీఎం వైయస్‌ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. 'అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, జవాన్లు, పోలీసులతో పాటు. అత్యవసర సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ నా సెల్యూట్‌. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వారికి మనం అందరం రుణపడి ఉంటాం.' అని ఈ మేరకు ట్వీట్‌ చేశారు.  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top