జ్యోతిరావు పూలే కృషి చిరస్మరణీయం

మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి సీఎం వైయస్‌ జగన్‌ నివాళి
 

తాడేపల్లి: దేశసమాజ పునర్నిర్మాణానికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..వెనుకబడిన తరగతుల సంక్షేమం, అందరికీ చదువులు, మహిళా సాధికారత వంటి ఆ మహనీయుని ఆశయాలే స్ఫూర్తిగా మన ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు.  కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు మోపిదేవి, వెల్లంపల్లి.. ఎమ్మెల్యే జోగి రమేష్‌, వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం హాజరయ్యారు.  

Back to Top