నేడు వైయ‌స్ఆర్ జిల్లాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌‌ 

తాడేప‌ల్లి:  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ఈ నెల 7, 8 తేదీల్లో వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్  రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ను సీఎం అదనపు పీఎస్‌ కె.నాగేశ్వరరెడ్డి  విడుదల చేశారు. 

షెడ్యూల్‌ ఇలా.. 

► 7వ తేదీ మ.3.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయల్దేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి విమానంలో కడపకు బయల్దేరుతారు.  
► సాయంత్రం కడప విమానాశ్రయంలో దిగి.. హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రికి ఇడుపులపాయ అతిథి గృహంలో బస చేస్తారు.  
► 8వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు.  
​​​​​​​► అనంతరం వైయ‌స్ఆర్‌‌ సర్కిల్, ఆర్‌.కె.వ్యాలీ వద్ద ఆర్‌జీయూకేటీకి చేరుకుని కొత్త భవన సముదాయానికి ప్రారంభోత్సవం.. 3 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.  
​​​​​​​► ఆ తర్వాత ఇడుపులపాయ అతిథి గృహానికి వెళ్తారు. మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి వెళ్లి అక్కడి∙నుంచి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.   

తాజా ఫోటోలు

Back to Top