సీవీ సుబ్బారెడ్డి కుటుంబానికి సీఎం ప‌రామ‌ర్శ 

వైఎస్ఆర్ జిల్లా  :   ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న స‌మీప బంధువు సీవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు.  ఇటీవ‌ల అనారోగ్యంతో సీవీ సుబ్బారెడ్డి మృతి చెందారు. ఈ నేప‌థ్యంలో ఆ కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి సీఎం ప‌రామ‌ర్శించారు.  ఇంటి పెద్ద కోల్పోయిన‌ప్పుడు గుండె నిబ్బ‌రంతో ఉండాల‌ని సుబ్బారెడ్డి స‌తీమ‌ణిని ఓదార్చారు. 

  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
తన రెండు రోజుల పర్యటనలో మొదటి రోజు గురువారం పులివెందుల లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం  పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్ నుండి హెలికాఫ్టర్లో బయలుదేరి సాయంత్రం 5.50 గంటలకు ఇడుపులపాయ కు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి  చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎంకు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఘ‌న స్వాగతం ప‌లికారు.

కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ  పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, సుధీర్ రెడ్డి, జడ్పి చైర్మన్ ఆకెపాటి  అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, అనుడ చైర్మన్ గురుమోహన్,  పాడా ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ద్వామా పిడీ యదుభూషన్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు ఇడుపులపాయలో ముఖ్యమంత్రికి సాదరంగా ఆహ్వానం పలికారు.
 ఆహ్వానం పలికిన వారిని పేరుపేరునా ఆత్మీయంగా పలకరించిన ముఖ్యమంత్రి 

 అనంతరం ఇడుపులపాయ హెలిప్యాడ్ నందు సాయంత్రం 5.50 గంటల నుండి 6.40 గంటల వరకు   అక్కడ ఉన్నవారి నుండి ముఖ్యమంత్రి అర్జీలను స్వీకరించారు.

 అనంతరం హెలిప్యాడ్ నుంచి వాహనంలో సాయంత్రం  గెస్ట్ హౌస్ కు ముఖ్యమంత్రి చేరుకున్నారు.

 జిల్లా పర్యటన లో బాగంగా రెండో రోజు శుక్రవారం   (10.11.23) ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు  

 అనంతరం ఇడుపులపాయ నెమళ్ల పార్కులో  వేముల ప్రజాప్రతినిధులతో జరిగే రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారు

Back to Top