రేపు, ఎల్లుండి వైయ‌స్‌ఆర్‌ కడప జిల్లాలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు, ఎల్లుండి వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ విడుద‌ల చేశారు. సెప్టెంబ‌ర్ 1వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప బయలుదేరుతారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో స‌మావేశం అవుతారు. వైయ‌స్ఆర్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు. 2వ తేదీ ఉదయం 9.30 గంటలకు దివంగత నేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయ‌స్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పిస్తారు.  ఆ తర్వాత పార్టీ నాయకులతో స‌మావేశం అవుతారు.   ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బ‌య‌లుదేరి 12.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top