7న వైయ‌స్ఆర్ జిల్లాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ 

  వైయ‌స్ఆర్  జిల్లా పర్యటన ఖరారు

 
వైయ‌స్ఆర్ జిల్లా ‌ :  దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్  రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 7, 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయ‌స్ఆర్  జిల్లా పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. హరికిరణ్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ హరికిరణ్‌ జిల్లా అధికారులతో, ఎస్పీ అన్బురాజన్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్‌-19 నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రోటోకాల్‌(ఎస్‌ఓపీ) తప్పనిసరిగా పాటించాలన్నారు. పర్యటనలో భాగంగా ఇడుపులపాయ, ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. బందోబస్తు పరంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని ఎస్పీ అన్బురాజన్‌కు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top