5న తిరుప‌తిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

శ్రీ‌నివాస‌సేతును ప్రారంభించ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
 

తిరుప‌తి:  ఈ నెల 5వ తేదీన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరుప‌తిలో ప‌ర్య‌టించ‌నున్నారు.  సీఎం తిరుపతి పర్యటనలో భాగంగా చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన, టాటా క్యాన్సర్ ఆసుపత్రి, శ్రీ‌నివాస‌సేతును ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల నిర్మాణానికి 21 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు మరో ఏడాదిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి అవుతుంద‌న్నారు. విపత్తుల సమయంలో ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురికాకుండా కమిటి సూచనలు. అనేక ప్రాంతాలలో ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేపడుతున్న‌ట్లు వివ‌రించారు. రెండు విడతలుగా మరమ్మత్తులు.. 36 కోట్లు ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేప‌డుతామ‌ని తెలిపారు.   

Back to Top