వైయ‌స్ఆర్ జిల్లాలో సీఎం వైయ‌స్ జగన్‌ మూడు రోజుల పర్యటన

కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటన 

కడపలో అమీన్‌పీర్‌ దర్గాలో ప్రార్థనలు, వివిధ ప్రైవేటు కార్యక్రమాలకు హాజరు 

కమలాపురంలో బహిరంగసభ 

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం 

పులివెందుల, ఇడుపులపాయలలో క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనలు, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం  

వైయ‌స్ఆర్ జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లాలో ఈనెల 23, 24, 25 తేదీలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు పత్రికలకు విడుదల చేశారు. 

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా..  
ఈనెల 23వ తేదీన 
►ఉదయం 10.15 గంటలకు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 
►10.45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.30 గంటలకు కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 
►11.35 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.50 గంటలకు కడపలోని అమీన్‌పీర్‌ దర్గాకు చేరుకుంటారు. 
►11.50 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 
►12.20 గంటలకు దర్గా నుంచి బయలుదేరి 12.35 గంటలకు రాష్ట్ర పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి స్వగృహానికి చేరుకుంటారు. 
►12.35 నుంచి 12.45 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. 
►12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఇంటికి 12.50 గంటలకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 
►1.00 గంటకు మల్లికార్జునరెడ్డి ఇంటి నుంచి బయలుదేరి 1.15 గంటలకు మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. 
►1.15 నుంచి 1.25 గంటల వరకు వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌ కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతారు. 
►1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
►1.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 2.05 గంటలకు కమలాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 
►2.15 గంటలకు బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. 
►2.15 నుంచి 2.25 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 
►2.30 నుంచి 3.45 గంటల వరకు బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 
►3.55 గంటలకు కమలాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 
►4.00 నుంచి 4.30 గంటల వరకు స్థానిక నేతలతో మాట్లాడతారు. 
►4.35 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. 
►5.00 గంటలకు ఇడుపులపాయ వైయ‌స్ఆర్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 

24వ తేదీన 
►ఉదయం 9.00 గంటలకు వైయ‌స్ఆర్ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి వైయ‌స్ఆర్ ఘాట్‌కు చేరుకుంటారు. 
►9.10 నుంచి 9.40 గంటల వరకు వైయ‌స్ఆర్ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 
►9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.00 నుంచి 12.00 గంటల వరకు ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు. 
►మధ్యాహ్నం 12.05 గంటలకు వైయ‌స్ఆర్  ఎస్టేట్‌కు చేరుకుని 12.15 నుంచి 12.30  గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. 
►12.35 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 12.40 గంటలకు పులివెందులలోని భాకరాపురంలోగల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 
►1.10 నుంచి 1.20 గంటల వరకు విజయ హోమ్స్‌ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 
►1.30 నుంచి 1.40 గంటల వరకు కదిరిరోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డును ప్రారంభిస్తారు. 
►1.50 నుంచి 2.00 గంటల వరకు కూరగాయల మార్కెట్‌ ప్రారంభిస్తారు. 
►2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లే అవుట్‌ను ప్రారంభిస్తారు. 
►2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు. 
►3.00 నుంచి 3.30 గంటలవరకు డాక్టర్‌ వైయ‌స్ఆర్  బస్టాండును ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 
►3.35 నుంచి 3.55 గంటల వరకు అహోబిలపురం స్కూలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. 
►4.05 నుంచి 4.20 గంటల వరకు 10 ఎంఎల్‌డీ ఎస్‌టీపీని ప్రారంభిస్తారు. 
►4.30 నుంచి 4.45 గంటల వరకు జీటీఎస్‌ను ప్రారంభిస్తారు. 
►5.00 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్‌ చేరుకుని 5.40 గంటలకు ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 

25వ తేదీన 
►ఉదయం 8.40 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 
►9.15 నుంచి 10.15 గంటల వరకు సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొంటారు. 
►10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 11.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
►11.00 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 11.55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని 12.20 గంటలకు తాడేపల్లిలోని  నివాసానికి చేరుకుంటారు.   

Back to Top