స్పందన కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్సీలతో సీఎం టñ లికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజలు ఇస్తున్న వినతిపత్రాలకు రశీదులు ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. రశీదుల మీదే పలానా తేదీలోగా పరిష్కరిస్తామని రాసి ఇవ్వాలని సలహా ఇచ్చారు. ఆ రశీదులను కంప్యూటరైజ్‌ చేసి డేటాబేస్‌లో ఉంచాలన్నారు. ఇచ్చిన టైం ప్రకారం సమస్యలను పరిష్కరిస్తున్నారో? లేదో కలెక్టర్లు, ఎస్సీలు పర్యవేక్షించాలని సూచించారు. 
 

Back to Top