మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. అంబులెన్స్‌ వాహనానికి దారిచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం వైయస్‌ జగన్‌ కాన్వాయ్‌ కడప ఎయిర్‌పోర్టు నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాల‌యానికి బ‌య‌ల్దేరింది. మార్గ‌మ‌ధ్య‌లో వైయస్‌ఆర్‌ సర్కిర్‌ వద్ద కాన్వాయ్‌ వెనుక వస్తున్న అంబులెన్స్‌ను గమనించిన సీఎం వైయస్‌ జగన్‌.. తన కాన్వాయ్‌ను పక్కకు ఆపి మరీ 108 వాహనానికి దారిచ్చారు. అంబులెన్స్‌ ముందుకెళ్లిన తరువాతే సీఎం వైయస్‌ జగన్‌ కాన్వాయ్‌ కదిలింది. 

Back to Top