సీఎం ఔదార్యం.. ఆ త‌ల్లి స‌మ‌స్యకు ప‌రిష్కారం

కాకినాడ‌:తునిలో తన పర్యటన సందర్భంగా జనాల మధ్య కుమారుడితో ఉన్న తల్లి తనూజను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గుర్తించి.. వెంటనే తన కాన్వాయ్‌ ఆపి దిగి తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజ ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అనారోగ్య సమస్యను వివరించి ఆదుకోవాల‌ని కోరింది. ఆ త‌ల్లి త‌నూజ బాధ‌ను చూసి చ‌లించిపోయిన సీఎం.. అప్పటికప్పుడు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్‌కు సమస్యను పరిష్కరించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top