విశాఖ‌, అన‌కాప‌ల్లి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ, అనకాపల్లి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ‌కు బ‌య‌ల్దేరారు. మ‌రికాసేప‌ట్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధురవాడ ఐటీ హిల్స్ నంబ‌ర్‌-3 వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఐటీ హిల్ నంబ‌ర్‌-2కు చేరుకొని ఇన్ఫోసిస్‌ కార్యకలాపాల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం ఇన్ఫోసిస్‌, వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చ‌టిస్తారు. అనంతరం హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొని అక్కడ జీవీఎంసీ ఆధ్వర్యంలో బీచ్‌ క్లీనింగ్ మెషీన్ల‌ను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో పరవాడ చేరుకొని ఫార్మా సిటీలో గల యుజియా స్టెర్లీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అచ్యుతాపురం సెజ్‌లో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొని.. అక్కడ మధ్యాహ్నం ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి లారెస్‌ ల్యాబ్‌కు చేరుకొని యూనిట్‌–2ను ప్రారంభిస్తారు. పరిశ్రమను సందర్శించి, కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు, ఉద్యోగులతో ఇంటరాక్ట్‌ అవుతారు. కార్య‌క్ర‌మం అనంత‌రం విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి తాడేప‌ల్లికి తిరుగు ప్ర‌యానమవుతారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top