పులివెందుల‌లో ప‌లు అభివృద్ధి ప‌నులు ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్ జిల్లా:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత నియోజక వర్గమైన పులివెందులలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా పులివెందులలో డాక్టర్ వైయ‌స్ఆర్‌  సర్వజన(జనరల్‌) ఆస్పత్రిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముందుగా ప్రారంభించారు. అక్క‌డే డాక్టర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని ముఖ్య‌మంత్రి అవిష్కరించారు. అనంత‌రం మెడికల్ కళాశాల, అసుపత్రికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి  వైద్య అరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కృష్ణబాబు వివ‌రించారు. 
ఆ తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైయ‌స్ఆర్‌ మినీ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని దానిని ప్రారంభించారు. ఆ తర్వాత డాక్టర్ వైయ‌స్ఆర్‌ జంక్షన్‌ కు వెళ్లి సెంట్రల్‌ బౌల్‌ వార్డ్‌ ప్రారంభించిన తర్వాత వైయ‌స్‌ జయమ్మ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ముఖ్య‌మంత్రి ప్రారంభించారు.  అనంతరం డాక్టర్ వైయ‌స్ఆర్‌ ఉలిమెల్ల లేక్‌ ఫ్రంట్‌‌ను సంద‌ర్శించి, పార్కును ప‌రిశీలించారు. పార్కును ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ కొద్దిసేపు గ‌డిపారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్‌-1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్‌ వద్దకు చేరుకుంటారు.   కార్యక్రమంలో కడప ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్దానిక నాయకులు ఉన్నారు.

Back to Top